Total Pageviews

Gayathri Groups

Thursday, April 14, 2011

theen maar movie review 3.75 / 5






 *****

నిర్మాత - గణేష్
 స్క్రీన్ ప్లే,
దర్శకత్వం - జయమత్ .సి.పరాన్జీ
కథ - ఇంతియాజ్ ఆలీ
సంగీతం - మణిశర్మ
సినిమాతోగ్రఫీ - జయనన్ విన్సెంట్
మాటలు - త్రివిక్రమ్ శ్రీనివాస్
పాటలు - రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల రవికుమార్, విశ్వ, రెహమాన్
ఎడిటింగ్ - యమ్.ఆర్.వర్మ
ఆర్ట్ - నారాయణ రెడ్డి
కొరియోగ్రఫీ - రాజు సుందరం, కళ్యాణి
యాక్షన్ - టినూ వర్మ
తారాగణం - పవన్ కళ్యాణ్, త్రిష, కృతి కర్బందా, పరేష్ రావెల్,
 సోనూ సూద్, ముఖేష్ రుషి, ఆలీ, తనికెళ్ళ భరణి, సుధ, మేల్కోటే,
 ప్రగతి, భార్గవి తదితరులు...
 కథ
హిందీలో సూపర్ హిట్టయిన "లవ్ ఆజ్ కల్" సినిమాకిది మక్కీకి
 మక్కీ కాపీ. మీరు గనక ఆ సినిమా చూసుంటే ఈ సినిమా చూడాల్సిన
 పనిలేదు. కాకపోతే పవన్ కళ్యాణ్ నటన కోసం ఈ సినిమా చూడొచ్చు.
 ఇక కథ విషయానికొస్తే ముప్పై యేళ్ళ క్రితం అర్జున్ పాల్వాయ్ ( పవన్ కళ్యాణ్)
 వసుమతి ( కృతి కర్బందా) అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. ఆమె కోసం ఆమె
 కుటుంబంతో గొడవ పడతాడు. చివరికి తన ప్రేమను సఫలీకృతం చేసుకుంటాడు.
 ప్రస్తుతానికొస్తే యు.యస్.లో ఉండే మైకేల్ వేలాధన్ ( పవన్ కళ్యాణ్) జీవితాన్ని
 జాలీగా తీసుకునే మనిషి. అతను అమ్మాయిల వెంట తిరుగుతూ,
జీవితాన్ని ఎంజాయ్ చేస్తూంటాడు.

అతనికి ప్రేమ వంటికి పడదు. యమ్ బి ఎ చదివి ఒక హోటల్లో
 షెఫ్ గా పనిచేస్తుంటాడు. అలాంటి వేలాయుధన్ కి మీరా (త్రిష) అనే
 అమ్మాయి తారసపడుతుంది. అదే సమయంలో సేనాపతి (పరేష్ రావెల్)
 తన స్నేహితుడు అర్జున్ పాల్వాయ్ ప్రేమ కథని వేలాయుధన్ తో
చెపుతూంటాడు. అతనికే ఎందుకు చెపుతాడంటే వేలాయుధన్ అచ్చం
 అర్జున్ పాల్వాయ్ లా ఉంటాడు గనుక. అర్జున్ పాల్వాయ్ ప్రేమ కథ
 వింటూంటే మీరాతో పరిచయం వేలాయుధన్ లో కనపడని మార్పు
 తెస్తుంది. ఎందుకంటే అర్జున్ పాల్వాయ్ లోనూ, మైకేల్ వేలాయుధన్
 లోనూ కొన్ని కామన్ లక్షణాలుంటాయి. మీరా, వేలాయుధన్ స్నేహితులుగా
విడిపోగానే మీరా ఇండియా వెళ్ళిపోతుంది. యు.యస్.లో మైకేల్ కి మిచెల్
 అనే రష్యన్ అమ్మాయి పరిచయమవుతుంది. మిచెల్ సాంగత్యంలో
 ఉన్నా మైకేల్ మీరాను మరచిపోలేక ఇండియాకి వెళతాడు.

అక్కడ మీరాకి సుధీర్ ( సోనూ సూద్ ) అనే యువ రాజకీయ నాయకుడితో
 సంబంధం నిశ్చయమై పెళ్ళవుతుంది. అక్కడి నుండి మైకేల్ లో మీరాని తను
 ప్రేమిస్తున్నానని తెలుస్తుంటుంది. ఇక్కడ మీరా పెళ్ళి సుధీర్ తో కాగానే,
 మైకేల్ కి అమెరికాలో తను కోరుకున్న కంపెనీలో కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది.
మళ్ళీ అమెరికా వెళ్ళిపోతాడు. మైకేల్ ని మరచిపోలేని మీరా సుధీర్ తో చెప్పి
 విడిపోతుంది. ఆ తర్వాత ఏమయింది....? మిచెల్ ని మైకేల్ ఏం చేశాడు...?
 మైకేల్ ని మీరా కలిసిందా...? మైకేల్ చివరికి జీవితం గురించి ఏం తెలుసుకున్నాడనేది మిగిలిన కథ.
ఎనాలసిస్ :
చాలా జాగ్రత్తగా హిందీ సినిమాని చిన్న చిన్న మార్పులతో అలాగే తీశారు.
దర్శకుడు జయంత్ ఈ సినిమా కోసం కొత్తగా చేసిందేం లేదు. హింది సినిమాని
 ఫాలో అవటమే జయంత్ చేసింది. ఇక అర్జున్ పాల్వాయ్ గా,
 మైకేల్ వేలాయుధన్ గా పవన్ కళ్యాణ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఈ రెండు పాత్రల్లోనూ వీలయినంత వైరుధ్యాన్ని పవన్ కళ్యాణ్ చూపించారనే
చెప్పాలి. ఒక క్రమబద్ధమైన నీతివంతమైన జీవితాన్ని అర్జున్ పాల్వాయ్ గడిపితే,
ఏ నీతీ లేకుండా జీవితాన్ని ఆస్వాదించటమే లక్ష్యంగా బ్రతికే నేటి కొంతమంది
యువకులకు ప్రతినిధిగా మైకేల్ వేలాయుధన్ పాత్ర ఉంటుంది.

మళ్ళీ పాత చిత్రాల్లో అంటే "ఖుషి", "బద్రి" వంటి చిత్రాల్లోలా ఈ చిత్రంలో కూడా
పవన్ కళ్యాణ్ నటనలో ఎనర్జీ, ఉత్సాహం కనబడటం అభిమానులకు ఆనందం
కలిగించే విషయం. ఇక హీరోయిన్ త్రిష ముఖంలో ముడతలు స్పష్టంగా కనపడుతున్నాయి.
 త్రిష ముఖంలో కళ తప్పింది. కానీ ఆమె నటనలో మాత్రం పరిణితి కనిపించింది.
 కృతి కర్బందా మేకప్ కాస్త తగ్గిస్తే బాగుండేదనిపించింది. ఆమె నటన కూడా ఫరవాలేదు.
 ఇక పరేష్ రామెల్, సోనూ సూద్, ఆలీ, తనికెళ్ళ భరణి, సుధ, ముఖేష్ రుషి,
మేల్కోటే వంటి నటీనటులంతా తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సంగీతం - గొప్పగా లేకపోయినా కొన్ని పాటలు వినటానికి బాగున్నాయి.
రీ-రికార్డింగ్ బాగుంది.
సినిమాటోగ్రఫీ - బాగుంది. కొన్ని ఫ్రేములు కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు.
 పాటల్లో, యాక్షన్ సీన్లలో కేమెరా వర్క్ బాగుంది.
మాటలు - చాలా బాగున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ బ్రాండ్ ఈ చిత్రంలో స్పష్టంగా
కనపడుతుంది. మాటల్లో ట్రికిష్ లాజిక్ మనల్ని బాగా ఆలోచింపజేస్తూ ఆకట్టుకుంటుంది.
 ముఖ్యంగా హీరో డైలాగుల్లో.
పాటలు - సాహిత్య పరంగా అన్ని పాటలూ బాగున్నాయనే చెప్పాలి. కాశీలో శివుడి పాట,
 "ఆలె ఆలె ఆలె ఆలె" పాట సాహిత్య పరంగా ప్రేక్షకుల బాగా ఆకట్టుకుంటాయి.
ఎడిటింగ్ - యమ్ ఆర్ వర్మ ఎడిటింగ్ బాగుంది.
ఆర్ట్ - ఈ చిత్రంలో ఆర్ట్ పనితనం చాలా బాగుంది. ముప్పయ్యేళ్ళ క్రితం భారత దేశానికి,
 ఇప్పటి భారత దేశానికి ఉన్న తేడాని ఆర్ట్ డైరెక్టర్ నారాయణ రెడ్డి చాలా చక్కగా చూపించారు.
కొరియోగ్రఫీ - బాగుంది. ముఖ్యంగా "ఆలె ఆలె ఆలె ఆలె" పాటలో కొరియోగ్రఫీ
పవన్ కళ్యాణ్ స్టైల్లో ఉండి బాగుంది.
యాక్షన్ - ఈ సినిమాలో మామూలుగా హీరో తంతే విలన్లు వందగజాల దూరం
 గాల్లోకి ఎగిరిపోవటం వంటివి లేకుండా టిను వర్మ యాక్షన్ కంపోజింగ్ సహజంగా
ఉండి ఆకట్టుకునే ఉంది.
ప్రోస్పెక్టివ్:
ఈ సినిమా నానాటికీ నేటి యువతరంలో తరిగిపోతున్న మానవ విలువల 
గురించి, జీవితం గురించి నేటి యువత ఆలోచనా విధానాన్ని చక్కగా కళ్ళ
ముందుంచుతుంది.  పవన్ కళ్యాణ్ ఎనర్జిటిక్ నటన కోసం ఈ సినిమా హ్యాపీగా చూడండి